Surprise Me!

స్వాతి భర్తను చంపడానికి కారణాలు ! అసహ్యం వేస్తోంది | Oneindia Telugu

2017-12-11 38 Dailymotion

Swathi brother responded on her on Monday in Nagarkarnool. <br /> <br />తమ సోదరి స్వాతిని అందరం ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్లమని, అలాంటి తను ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నామని, ఆమెను చూస్తే అసహ్యం వేస్తోందని స్వాతి సోదరుడు జైపాల్ అన్నారు. ప్రియుడి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే హత్య చేసిన స్వాతి ఉదంతం కలకలం రేపిన విషయం తెలిసిందే. <br />భర్త వ్యాపార పనుల్లో పడి తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో అడ్డదారి తొక్కింది. రాజేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని, భర్తను చంపి, ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ప్రియుడు రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.తన బావ సుధాకర్ రెడ్డి చాలా మంచివాడని జైపాల్ చెప్పారు. స్వాతి అరెస్ట్, బావ సుధాకర్ రెడ్డి హత్య నేపథ్యంలో ఆయన కన్నీరుమున్నీరు అయ్యారు. తన సోదరిని ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో చూస్తానని అనుకోలేదని చెప్పారు. <br />తన సోదరి పిల్లల భవిష్యత్తును తాను చూసుకుంటానని జైపాల్ చెప్పారు. కాగా, సుధాకర్ రెడ్డి అవశేషాలకు నాగర్ కర్నూలులో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా స్వాతిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Buy Now on CodeCanyon